దుబాయ్‌లో హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌కి గ్రేస్‌ పీరియడ్‌

- June 03, 2016 , by Maagulf
దుబాయ్‌లో హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌కి గ్రేస్‌ పీరియడ్‌



జూన్‌ 30 నాటికి డిపెండెంట్స్‌, ఎల్డర్లీ మరియు డొమెస్టిక్‌ వర్కర్స్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ రెన్యువల్‌ గడువు ముగియనుండగా, దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ, ఈ గడువుని డిసెంబర్‌ 31, 2016 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల గ్రేస్‌ పీరియడ్‌లో ఇండివిడ్యువల్స్‌ మరియు వారిపై ఆధారపడ్డవారికి చట్టబద్ధంగా తప్పనిసరి అయిన హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. చిన్న కంపెనీలకు సంబంధించి వీసా లింక్‌ జూన్‌ 30 తర్వాత యాక్టివేట్‌ అవుతుందనీ, ఇండివిడ్యువల్స్‌ అలాగే కుటుంబాలకు మాత్రం ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఉంటుందని డాక్టర్‌ హైదర్‌ అల్‌ యూసుఫ్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫండింగ్‌ డిహెచ్‌ఏ తెలిపారు. తమపై ఆధారపడ్డవారికి, అలాగే స్పాన్సరర్స్‌కి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ పొందాలని ఆయన సూచించారు. 3.8 మిలియన్‌ ప్రజలు దుబాయ్‌ రెసిడెన్స్‌ వీసా పొంది ఉన్నారు. దుబాయ్‌ వీసా కలిగి ఉన్న 75 శాతం దుబాయ్‌ పాపులేషన్‌, ఇప్పటికే హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కలిగి ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 95 శాతం మంది మాండేటరీ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కవర్‌ పొందుతారని అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com