గల్ఫ్ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌ నియామకం

- March 05, 2024 , by Maagulf
గల్ఫ్ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌ నియామకం

కువైట్: గల్ఫ్ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌గా మిస్టర్ బాదర్ నాసర్ అల్-ఖరాఫీని గల్ఫ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిజర్వ్ సభ్యుడైన  అబ్దుల్‌లతీఫ్ అబ్దుల్ అజీజ్ అల్-షరీఖ్‌ను బోర్డులో మెంబర్ గా ఎన్నుకున్నారు.  అలీ మురాద్ బెహబెహన్ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బోర్డులోని ఇతర సభ్యులలో అహ్మద్ మొహమ్మద్ అల్-బహర్, అబ్దుల్‌రహ్మాన్ మొహమ్మద్ అల్-తవిల్, ఒమర్ హమద్ అల్ ఖీనీ, బరాక్ అబ్దుల్‌మోహ్సేన్ అల్-అస్ఫోర్, ఫవాజ్ మొహమ్మద్ అల్-అవాది, అబ్దుల్లా సయ్యర్ అల్ సయ్యర్, తలాల్ అలీ అల్-సయెగ్, రీమ్ అబ్దుల్లా అల్-సలేహ్ ఉన్నారు.  గల్ఫ్ బ్యాంక్ యొక్క 2025 వ్యూహం, ఆర్థిక మరియు కార్యాచరణ పనితీరును పెంపొందించడం, వినియోగదారులకు అసాధారణమైన ఉత్పత్తులు, సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. స్థానిక మరియు అంతర్జాతీయ కంపెనీలలో ఆర్థిక మరియు పారిశ్రామిక రంగాలలో రెండు దశాబ్దాల అనుభవం బాదర్ నాసర్ అల్-ఖరాఫీ కు ఉన్నది.  మార్చి 2012లో గల్ఫ్ బ్యాంక్ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కువైట్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.  ఆ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ప్రస్తుతం, అతను స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ (ఇన్‌స్టిట్యూటో డి ఎంప్రెసా)లో డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌లో చేరాడు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com