‘డబుల్ ది డిస్కవరీ’ ప్రచారాన్ని ప్రారంభించిన ఖతార్, సౌదీ
- March 07, 2024
దోహా: ప్రముఖ DMC డిస్కవర్ సౌదీ (అల్మోసాఫర్లో భాగం) 'డబుల్ ది డిస్కవరీ' అనే కొత్త ప్రచారాన్ని ITB బెర్లిన్ కన్వెన్షన్‌లో ఖతార్ టూరిజం, సౌదీ టూరిజం అథారిటీ ప్రారంభించాయి. రెండు దేశాలలోని అంతర్జాతీయ సందర్శకులకు ఖతార్ మరియు సౌదీ అరేబియా గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక అద్భుతాలను ఒకే పర్యటనలో తెలుసుకునే అవకాశం ఉన్నది. క్యూరేటెడ్ ట్రావెల్ ప్యాకేజీలతో.. 'డబుల్ ది డిస్కవరీ' రెండు దేశాల విభిన్న ప్రకృతి దృశ్యాలు, నిర్మాణ అద్భుతాలు, శక్తివంతమైన సంప్రదాయాలను ప్రదర్శించే ప్రత్యేకమైన అనుభవాలను పర్యాటకులకు అందించే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ తీసుకొచ్చినట్లు ఖతార్ టూరిజం చైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ మాట్లాడుతూ.. సౌదీ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని, 2023 మొదటి మూడు త్రైమాసికాల్లో 20 మిలియన్లకు పైగా ఇన్‌బౌండ్ సందర్శకులను స్వాగతించిందన్నారు. డిస్కవర్ ఖతార్ వివిధ రకాల హోటళ్లు, బీచ్ సౌకర్యాలకు యాక్సెస్‌తో సహా విభిన్న ప్రాధాన్యతలను అందించే 'స్టాప్ఓవర్' ప్యాకేజీలను అందిస్తుంది. 'డబుల్ ది డిస్కవరీ' ప్రయాణికులకు ఒకే ట్రిప్‌లో రెండు దేశాలలోని గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక అద్భుతాలను అన్వేషించే ఏకైక అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







