రెమ్యునరేషన్ విషయంలో సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు.!
- March 07, 2024
సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు.. హీరో కానీ, హీరోయిన్ కానీ రెమ్యునరేషన్ పెంచేస్తారు.. అనే ప్రచారం వుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి విషయంలోనూ తాజాగా అదే ప్రచారం జరుగుతుంది.
సాయి పల్లవి మంచి నటి. మంచి ఫాలోయింగ్ వుంది. అయినా స్టార్ హీరోయిన్ అయిపోవాలన్న అత్యాశకు పోకుండా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటుంది.
ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సాయి పల్లవికి రెమ్యునరేషన్ గురించిన ప్రశ్న ఎదురైంది.
ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారట కదా మీరు.. అనేదే ఆ ప్రశ్న. అందుకు సాయి పల్లవి ఇచ్చిన సమాధానం.. నేను నటించిన సినిమా సూపర్ హిట్ అయితే మేకర్సే నన్ను పిలిచి మరీ ఎక్కువ అమౌంట్ ఇస్తారు.. అలాంటప్పుడు నేనెందుకు డిమాండ్ చేయడం అని సమాధానమిచ్చింది.
అలాగే, ఒకవేళ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే సిట్యువేషనే రావాలంటే.. అది నేను నటించలేని పాత్ర.. అత్యంత కఠినమైన పాత్ర అయ్యుండాలి.. అప్పుడేమైనా డిమాండ్ చేస్తానేమో.. అని నవ్వుతూ సాయి పల్లవి సమాధానమిచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







