అందుకేనా ఆ సినిమాలకి ‘ఏ’ సర్టిఫికెట్లు.?
- March 07, 2024
ఈ వారం శివరాత్రి సందర్భంగా రెండు ప్రత్యేకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయ్. అవే ‘గామి’, ‘భీమా’.
వాస్తవానికి విశ్వక్ సేన్ నటించిన సినిమాలంటే ప్రమోషన్లు ఓ రేంజ్‌లో వుండి వుండాలి. ఆ రేంజ్ ప్రమోషన్లయితే ‘గామి’ సినిమాకి జరగడం లేదు. కానీ, రిలీజ్ చేసిన ప్రోమోలే సినిమాపై అంచనాలు పెంచుతున్నాయ్.
రెగ్యులర్ కాన్సెప్ట్ మూవీస్ కావు ఈ రెండు సినిమాలూ. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఫార్ములా.. సూపర్ నేచురల్ పవర్స్.
ఆ తరహా కాన్సెప్టులే ఈ రెండు సినిమాల్లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘సాహసం’ అనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేశాడు గోపీచంద్. కానీ, అది వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు ‘భీమ’తో పోలీస్ గెటప్‌తో మాస్ లుక్స్‌తో వస్తున్నాడు కానీ, కథ పరంగా చూస్తే ఇదో డిఫరెంట్ థ్రిల్ ఇచ్చే సినిమా అనిపిస్తోంది. అలాగే విశ్వక్ సేన్ ‘గామి’ కూడా.
అయితే ఈ రెండు సినిమాలకూ సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే, అభ్యంతరకరమైన సన్నివేశాలేమైనా ఈ సినిమాలో వున్నాయా.? లేదంటే, అతి రక్తపాతం.. అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్సా.? అని డౌటామానం కలుగుతోంది. ఏది ఏమైతేనేం, రెండూ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయ్. చూడాలి మరి, రిజల్ట్ ఎలాంటిదొస్తుందో.!
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







