ఈరోజు నుండి యాదాద్రి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- March 11, 2024
తెలంగాణ: తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదాద్రి క్షేత్రంలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే ఉత్సవాలకు, వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ ఇఒ రామకృష్ణారావు తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
పూర్తి వివరాలు..
మార్చి 11వ తేదీ ఉదయం 1వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం
12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ
13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం
14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
15న ఉదయం శ్రీకృష్ణ అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ
21న ఉదయం నిర్వహించనున్న అష్టోత్తర శతఘటాభిషేకం
శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
తాజా వార్తలు
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..









