కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా..
- June 04, 2016
అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెరంగేట్రం చేస్తూ అఖిల్ నటించిన 'అఖిల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. తొలి చిత్ర ఫలితం ఇచ్చిన చేదు అనుభవంతో తదుపరి చిత్రానికి అఖిల్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ జాగ్రత్తల్లో భాగంగా మంచి కథ, మంచి దర్శకుడు కుదిరినప్పుడే రెండో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాలనే యోచనలో ఉన్నాడు. అయితే 'ఊపిరి' చిత్రం తర్వాత అఖిల్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. వీటిని సమర్థిస్తూ నాగార్జున సైతం మీడియాకి ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కేస్తుందని అనుకుంటున్న తరుణంలో కాంబినేషన్ మారిందంటూ ఓ సరికొత్త వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుందట. అఖిల్, నాగార్జునలకు ఇటీవల కొరటాల శివ వినిపించిన కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడిగా 'జనతా గ్యారేజ్' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







