బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో

- June 04, 2016 , by Maagulf
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తుండగా.. బాలకృష్ణ కాస్త విరామం తీసుకోనున్నట్లు సమాచారం. జూన్ 10 న బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయన పుట్టిన రోజు వేడుకలను అక్కడే ఘనంగా జరుపుకోనున్నారు. అంతేకాకుండా తాను చైర్మెన్ గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నిధుల సేకరణ కోసం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాగా బాలయ్య యూఎస్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ చిత్రంలో కథానాయిక ఎంపిక ను ఖరారు చేస్తారని చిత్ర బృందం చెప్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ ను ఎంపిక చేసే అవకాశం ఉండంటూ వార్తలు వినవస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com