దుబాయ్‌ పోలీస్‌ - రమదాన్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌

- June 04, 2016 , by Maagulf
దుబాయ్‌ పోలీస్‌ - రమదాన్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌



రమదాన్‌ సందర్భంగా రోడ్లపై ప్రమాదకర రీతిలో వాహనాలు నడిపేవారిపై వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సైఫ్‌ ముహైర్‌ అల్‌ మజ్రోయ్‌ పిలుపునిచ్చారు. నిబంధనల్ని అతిక్రమించి వాహనాలు నడిపేవారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. గత రమదాన్‌ సమయంలో 201 ట్రాఫిక్‌ యాక్సిడెంట్లు జరిగాయనీ, ఈ ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా, 147 మంది గాయపడ్డారని ఆయన వివరించారు. 8004353 నెంబరుకి కాల్‌ చేసి ఎవరైనా ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయొచ్చన్నారు. రోడ్లపై భద్రతకుగాను ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తాయనీ, ముఖ్యమైన సమయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని వివరించారు. ప్రధాన రోడ్లపైనా ఇంటర్నల్‌ రోడ్లపైనా పోలీస్‌ పెట్రోల్స్‌ కొనసాగుతాయని కల్నల్‌ మజ్రోయ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com