ప్రశ్నా పత్రాల లీక్ కేసు.. ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన అప్పీల్ కోర్టు
- March 17, 2024
కువైట్ సిటీ: ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఒక కువైట్ వ్యక్తికి, కువైట్ మహిళకు రెండేళ్ళ జైలుశిక్ష.. ప్రవాస వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు వెలువరించిన తీర్పును న్యాయమూర్తి అబ్దుల్ రెహ్మాన్ అల్ దర్మీ అధ్యక్షతన అప్పీల్ కోర్టు కొట్టివేసింది. హైస్కూల్ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు.. KD 308,000 లాండరింగ్ చేసినందుకు ప్రవాస మహిళకు, వ్యక్తికి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష ప్రకటించగా.. తాజాగా కోర్టు వారిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి నిర్దోషులుగా ప్రకటించింది. మరో కేసులో ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు కువైట్ పౌరుడిని నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది. పోలీసుల దర్యాప్తులో హైస్కూల్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఇతరుల ప్రమేయం, నిందితుల పాత్ర, అలాగే నేరాల ఫలితంగా వారి బ్యాంక్ ఖాతాలలోకి అక్రమంగా డబ్బు జమ అయినట్లు విచారణలో వెల్లడి కావడంతో దిగువ కోర్టు దోషులగా నిర్ధారించి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







