రష్యన్ హౌస్ ఒమన్ లో రికార్డ్-బ్రేకింగ్ ఈవెంట్..!
- March 17, 2024
మస్కట్: రష్యన్ హౌస్ ఒమన్ ఇప్పటివరకు అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన ఈవెంట్ స్ప్రింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మస్లెనిట్సా (రష్యన్ పాన్కేక్ వీక్), అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి దాదాపు 400 మంది ఒకచోట చేర్చింది. ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయ ఆటల పోటీలు, ఆర్ట్స్ తరగతులు, నృత్యం, లైవ్ మ్యూజిక్ పోటీలు నిర్వహించారు. అలాగే పిల్లో ఫైట్లు, టగ్-ఆఫ్-వార్ మరియు స్ట్రాంగ్‌మ్యాన్ పోటీ వంటి విభిన్న కార్యకలాపాలను గెస్ట్స్ ఆస్వాదించారు. మొదటిసారిగా రష్యన్ హౌస్ ఒమన్.. ఒమన్‌లో రష్యన్ మాట్లాడే వ్యాపారాలను కలిగి ఉన్న మార్కెట్‌ప్లేస్‌ను నిర్వహించింది. "ఈ ఈవెంట్ రష్యన్ సంస్కృతి వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి మరియు ఒమన్ - రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఫెస్టివల్లో మొట్టమొదటి రష్యన్ మాట్లాడే వ్యాపార మార్కెట్‌ను చేర్చడం వలన వ్యాపారాలు కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ సహకారాలను పెంచుతుంది. చివరికి రెండు దేశాలలో వ్యాపార వృద్ధిని సులభతరం చేస్తుంది." అని ఒమన్‌లోని రష్యన్ మాట్లాడే కమ్యూనిటీ ప్రెసిడెంట్ ఇగోర్ ఎగోరోవ్ తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







