ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- March 19, 2024
మస్కట్: జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్‌మార్క్‌లు, పేటెంట్లు, కాపీరైట్లు మరియు డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 2023లో 12.59 శాతం పెరిగి 14,234కి పెరిగిందని, 2022లో 12,642 దరఖాస్తులు నమోదయ్యాయని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని జాతీయ మేధో సంపత్తి కార్యాలయం జారీ చేసిన గణాంకాలను వెల్లడించింది. 2023లో జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్‌మార్క్‌ల కోసం 13,196 దరఖాస్తులు దాఖలయ్యాయి. 2022లో 11,744 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్ల కోసం మొత్తం 874 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. 2022లో 737 దరఖాస్తులు నమోదు కాగా.. 2023లో కాపీరైట్ల కోసం మొత్తం 143 దరఖాస్తులు, 2022లో 144 దరఖాస్తులు వచ్చాయి. 2022లో నమోదైన 17 దరఖాస్తులతో పోలిస్తే 2023లో పారిశ్రామిక డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 21కి పెరిగిందని గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు