కృత్రిమ కాంతిలో ఎక్కువగా గడుపుతున్నారా.? ఈ ప్రమాదాలు తప్పవ్ జాగ్రత్త.!

- March 21, 2024 , by Maagulf
కృత్రిమ కాంతిలో ఎక్కువగా గడుపుతున్నారా.? ఈ ప్రమాదాలు తప్పవ్ జాగ్రత్త.!

మారుతున్న జీవిన శైలిలో సహజమైన కాంతికి చాలా దూరమవుతున్నాం. కృత్రిమ కాంతిలో అంటే ఎక్కువ బ్రైట్‌నెస్ ఇచ్చే లైట్లు, ట్యూబ్ లైట్ల మధ్యనే ఎక్కువగా కాలం గడిపేస్తున్నాం. క్లోజ్‌డ్ డోర్స్‌లో పని ప్రదేశాలుండడం.. ఇరుకు ఇరుకు ఇళ్లు.. ఖాళీ ప్రదేశాలు కరువైవడం.. అపార్ట్‌మెంట్ కల్చర్.. ఇలా అనేక రకాల కారణాలు కృత్రిమ కాంతికి అలవాటు పడేలా చేస్తున్నాయ్.
ఇలా సహజ కాంతికి దూరంగా వుండడం మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కంటిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇలా కృత్రిమ కాంతికి అలవాటు పడడం వల్ల కంటి శుక్లాల సమస్య వయసుతో సంబంధం లేకుండా.. నిద్రలేమి, రేచీకటి వంటి సమస్యలు తలెత్తుతున్నాయ్.
అలాగే, శరీరానికి తగినంత సూర్యరశ్మి తగలకపోవడంతో హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయ్. రాత్రి పగలూ అనే తేడా లేకుండా బల్బుల వెలుగులో వుండిపోవడం వల్ల అది మన నిద్ర పైనా ప్రబావితం చూపిస్తుంది.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ్. ఆందోళన, అనవసరమైన ఒత్తడి, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అందుకే శరీరానికి రోజులో కనీసపాటి సూర్య రశ్మి తగిలేలా జాగ్రత్త పడాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో లైట్ల కాంతి కంటి మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఉన్నదాంట్లో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాస్తయినా ఆరోగ్యాన్ని ముఖ్యంగా దీర్ఘకాలంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com