ఉప్పు నీళ్ళ సాక్షిగా

- June 05, 2016 , by Maagulf


                                        
ఈవలి ఒడ్డున నేను
ఆవలి ఒడ్డున నువ్వు      
అలలతో  మాట్లాడుకుంటూ మనం        
ఉప్పు నీళ్ళ సాక్షిగా     
ఎప్పుడూ  మబ్బుల్లో  కలిసే  వుంటాం     
   
చేప  పిల్లలు  ఎగిరి దూకుతుంటే  
పసితనం  గిలిగింతలు పెట్టినట్టు నవ్వుకుంటాం          

సుడిగుండంలో  అలలు  చిక్కుకుంటే
కలలు మునిగినట్టు  బాధ  పడతాం
                                   
సముద్రమంటే
మనలా.. దుఃఖాన్ని దాచుకున్న  లోతు

కాదంటావా

 

--పారువెల్ల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com