‘ఫ్యామిలీ స్టార్.! దిల్ రాజు హంగామా మామూలుగా లేదు.!
- April 02, 2024
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఈ వారం గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
అలాగే, ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహిస్తున్నారు. తన ప్రతి సినిమానీ దిల్ రాజు బాగానే ప్రమోట్ చేస్తుంటారు. అయితే, ఈ సారి ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సమానంగా ఆయన కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ట్రెడిషనల్ వేర్ ధరించి చేసిన ప్రమోషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
అలాగే, కొన్ని వేదికలపై హీరోతో కలిసి స్టెప్పులు ఇరగదీస్తున్నారు. ఇలా ఈ సినిమాని చాలా పర్సనల్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అవును మరి, ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ విజయ్ దేవరకొండకు మునుపటి వైభవం తీసుకురావాలన్న పట్టు మీదున్నారట ఆయన.
అంతేకాదు, ఓ ప్యాన్ ఇండియా సినిమా సైతం ఈ కాంబినేషన్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై రాజుగారు అనౌన్స్ చేసేందుకు రెడీగా వున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







