'శరభ' షూటింగ్ బనగానపల్లెలో
- June 06, 2016
ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటిలో ఆదివారం 'శరభ' షూటింగ్ జరిగింది. హీరో ఆకాష్, హీరోయిన్ మిస్తీ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రదపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి తల్లిగా జయప్రద ఈ సినిమాలో నటిస్తున్నారు. తల్లీ కూతుళ్లు యాగంటి ఆలయానికి వచ్చే సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. అలాగే హీరో ఆకాష్‌పై కూడా కొన్ని సన్నివేశాలను ఆలయంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా జయప్రద, డైరెక్టర్ నరసింహారావు, హీరోయిన్ మిస్తీ చక్రవర్తిలను బనగానపల్లె మాజీ సర్పంచ్, అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి కలిశారు. అనంతరం నటి జయప్రదతో ఆయన ముచ్చటించారు. యాగంటిలో గతంలో తీసిన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అన్నమయ్య, జయం మనదేరా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని రాజారెడ్డి ఆమెకు వివరించారు.అనంతరం జయప్రద మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రదేశానికి వచ్చానని, ఈ ప్రాంత వాసులు చాలా మంచివారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్లు అశ్వనీ కుమార్ సహదేవ్, రాధాకృష్ణ పాల్గొన్నారు. రూ.25 కోట్లతో చిత్ర నిర్మాణం : శరభ చిత్రాన్ని రూ.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు చిత్ర దర్శకుడు నరసింహారావు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు యాగంటి క్షేత్రంలో సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు. అలాగే అహోబిలంలోనూ, ఓర్వకల్లులోనూ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామ న్నారు. శరభ షోషల్ ఫ్యాంటసీ చిత్రమన్నా రు. ఈ చిత్రాన్ని ఏకేఎస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







