ఉమ్మెత్త ఆకులతో ఇన్ని లాభాలా.?
- April 13, 2024ఎక్కడో ఇంటికి దూరంగా పెంటపై పెరిగే ఉమ్మెత్త చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే నమ్ముతారా.? నిజంగా నిజం. ఉమ్మెత్త పువ్వు చూసేందుకు చాలా అందంగా వుంటుంది.
అంతేకాదండోయ్. గణపతికి, శివుడికి ఈ పువ్వుల్ని, వీటి కాయల్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కానీ ఇంటి పరిసరాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెరగనివ్వరు.
కానీ, ఈ చెట్టు ఉపయోగాలు తెలిస్తే.. పరిసరాల్లో కాదు, ఇంట్లోనే కుండీల్లో చక్కగా పెంచుకుంటారు. పెంచాల్సిన ఆవశ్యకత కూడా వుంది. ఇంతకీ ఉమ్మెత్తతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటీ.?
కీళ్ల నొప్పులు, వాపులు వున్నచోట ఉమ్మెత్త ఆకుల్ని నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి నొప్పి వున్న చోట కట్టులా వేస్తే నొప్పి సులువుగా లాగేస్తుంది.
అంతేకాదు, తీవ్రమైన సమస్యగా పరిగణించే మైగ్రేన్ తలనొప్పికి కూడా ఇది మంచి ఔషధం. పైన చెప్పిన విధంగానే ఆకులతో పట్టు వేస్తే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
అంతేకాదు, ఉమ్మెత్త ఆకుల్ని మెత్తని పేస్ట్‌లా నూరి కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే.. తలలో చుండ్రు మాయమైపోవడమే కాదు, పేలు వంటివి కూడా తగ్గిపోతాయ్.
దురదలు, గజ్జి, తామర వంటి అంటు వ్యాధులకు సైతం ఉమ్మెత్త ఆకులతో వైద్యం శ్రేయస్కరం. ఇన్ని ఉపయోగాలున్న ఉమ్మెత్త చెట్టును ఖచ్చితంగా ఇంట్లో పెంచాల్సిందేగా మరి.!
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్