దుబాయ్ లో ఒరిగిన భవనం..ఆందోళనలో నివాసితులు

- April 21, 2024 , by Maagulf
దుబాయ్ లో ఒరిగిన భవనం..ఆందోళనలో నివాసితులు

దుబాయ్‌: దుబాయ్‌లోని ముహైస్నా 4లోని బహుళ అంతస్తుల టవర్ నిర్మాణం దెబ్బతినడంతో శుక్రవారం (ఏప్రిల్ 19) అర్థరాత్రి ఆ ప్రాంగణంలో నివసిస్తున్న 100కు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. రాత్రి 8:30 గంటలకు 'భూకంపం లాంటి' కుదుపును అనుభవించినట్లు పలువురు నివాసితులు పేర్కొన్నారు.  ఇది కొన్ని సెకన్ల పాటు ఉందని తెలిపారు.  కొన్ని గంటల తర్వాత, దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెంటనే భవనం ఖాళీ చేయాలని నివాసితులను కోరారు. భవనం ఒక వైపు పగుళ్లు రావడంతో.. అది ఒక వైపునకు వంగడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. మరోవైపు యూఏఈలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా భవనం సెల్లార్ లో నీరు చేరిందని అద్దెదారులు తెలిపారు. నీటిని బయటకు పంపుతున్నప్పటికీ ఐదు రోజులు గడిచినా బేస్‌మెంట్‌లో కార్లు వరదనీటిలోనే ఉన్నాయి. రెండేళ్లకు పైగా భవనంలో నివసిస్తున్న లక్ష్మి మాట్లాడుతూ..    9వ అంతస్థులోని అపార్ట్‌మెంట్‌కి తిరిగి వచ్చేసరికి దాదాపు ఉదయం 6 గంటలైందని పేర్కొంది. తాము మా పత్రాలు మరియు బట్టలు రెండు సూట్‌కేసులలో సర్దుకుని బయలుదేరామని తెలిపింది.  "అక్టోబర్‌లో మా రెన్యూవల్ గడువు ఉంది" అని లక్ష్మి చెప్పారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com