తల్లితో గొడవపడి.. కనిపించకుండా పోయిన యువకుడు
- April 21, 2024
యూఏఈ: తన తల్లితో గొడవ పడి ఏప్రిల్ 12న అల్ రౌదా 1లోని తన ఇంటి నుండి బయలుదేరిన ఇబ్రహీం ముహమ్మద్ (17) కోసం అజ్మాన్ పోలీసులు వెతుకుతున్నారు. అతని కుటుంబ సభ్యులు ఎవరికైనా సమాచారం ఉంటే 0502924491 నంబర్‌లో సంప్రదించాలని లేదా అజ్మాన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. " ఇబ్రహీం, ప్లీజ్ ఇంటికి రా" అని ఇబ్రహీం తండ్రి పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ మషూక్ కోరారు. ఇబ్రహీం తల్లి తన ఆందోళనను వ్యక్తం చేసింది. అతను లేని ప్రతి క్షణం నరకంగా అనిపిస్తుందన్నారు. ఇబ్రహీం చివరిసారిగా నల్ల చొక్కా ధరించి ఇటీవల ఈద్ వేడుకల సందర్భంగా ఈదియాగా అందుకున్న కొంత డబ్బును తీసుకువెళ్లాడు.
గత నెలలో, షార్జాలో అదృశ్యమైన ఒక ఫ్రెంచ్ యువకుడిని వాళ్ల ఇంటికి దూరంలో ఉన్న ఎడారిలో గుర్తించారు. అదేవిధంగా, షార్జా ఆటిస్టిక్ టీనేజర్ షాపింగ్ మాల్ నుండి తప్పిపోయింది. 18 కిలోమీటర్ల దూరంలో దుబాయ్ విమానాశ్రయంలో ఒక భారతీయ ప్రయాణీకురాలి చొరవతో గుర్తించారు. డిసెంబరులో, 11 ఏళ్ల బాలుడు అరేబియా రాంచెస్ నుండి అదృశ్యమయ్యాడు. డ్రోన్లు మరియు స్నిఫర్ డాగ్‌లతో కూడిన విస్తృత శోధన అనంతరం అర్థరాత్రి దొరికాడు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







