వెజిటెబుల్ లాలీపప్
- June 07, 2016
కావలసినవి: ఉడికించిన బంగాళదుంపల ముద్ద ఒక కప్పు, తురిమిన చిన్న కేరెట్ ఒకటి, బీన్స్ 100 గ్రా., కేప్సికమ్ ఒకటి, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఒక్కో టీ స్పూన్, కేరెట్ స్టిక్స్ (కేరెట్‌ను నిలువుగా రెండు లేదా మూడు ముక్కలుగా చీల్చితే స్టిక్స్ తయారవుతాయి) 8 లేక 10, మైదా అర కప్పు, సోయా సాస్ ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్, బ్రెడ్ పొడి అర కప్పు, కోడిగుడ్డు ఒకటి, నూనె వేగించడానికి తగినంత, ఉప్పు, మిరియాల పొడి తగినంత.
ఎలా చేయాలి
కూరగాయలను సన్నగా తరగాలి. ఒక టేబుల్ స్పూన్ నూనెను బాణలిలో వేసి వేడి చేయాలి. అల్లం, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. కేరెట్ తురుము, బంగాళ దుంపల ముద్ద, తరిగిన బీన్స్, కేప్సికమ్, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. వీటన్నిటినీ 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కిందికి దించి చల్లారనివ్వాలి. గుడ్డు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని లాలిపాప్స్ తీరులో తయారు చేయాలి. ఈ లాలిపాప్స్‌లో కేరెట్ స్టిక్స్‌ను జాగ్రత్తగా గుచ్చాలి. వీటిని బ్రెడ్ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని సెజువాన్ సాస్‌తో గాని, టొమాటో కెచప్‌తో గాని తింటే చాలా బావుంటాయి.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







