వారానికోసారి.. ముఖానికి ఆవిరిపట్టడం వల్ల ఎన్నో లాభాలు..

- June 07, 2016 , by Maagulf
వారానికోసారి.. ముఖానికి ఆవిరిపట్టడం వల్ల ఎన్నో లాభాలు..

జలుబు చేసి.. ముక్కు మూసుకు పోయినప్పుడో.. ఫేషియల్‌ చేయించుకున్నప్పుడో ముఖానికి ఆవిరి పట్టడం సహజం. అలాకాకుండా వారానికోసారి.. ముఖానికి ఆవిరిపట్టడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. * ఆవిరి పట్టడానికి ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ ముఖానికి మేకప్‌ ఉంటే...దానిని తొలగించుకున్నాకే ఆవిరిపట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మంగ్రంథుల్లో చేరిన మురికి వెలుపలికి వచ్చేస్తుంది. ముఖం శుభ్రపడుతుంది.
* యాక్నె సమస్య ఉన్నవారు.. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఆ వేడికి చర్మ గ్రంథులు తెరచుకుంటాయి. లోపల మృతకణాలు తొలగిపోయి. బ్లాక్‌హెడ్స్‌ సమస్య మెల్లగా తగ్గుముఖం పడుతుంది.
* ముఖ చర్మంలో రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరిగి.. చర్మం మృదువుగా మారుతుంది. ముఖ చర్మ కణజాలానికి సరిపడా ప్రాణవాయువు అందుతుంది. ప్రయాణాలూ, ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోయి...నిర్జీవంగా తయారైనప్పుడు మృదువుగా ఏదైనా క్రీమ్‌తో మర్దన చేసుకుని ఆవిరి పట్టడితే చక్కటి ఫలితం ఉంటుంది.
* ఈ కాలంలో చెమట వల్ల శరీరంలోని వ్యర్థాలు చేరిపోతాయి. వాటిని తొలగించుకోవాలంటే..ఆవిరిస్నానానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అందుబాటులో లేనప్పుడు కనీసం ముఖానికైనా ఆవిరి పడితే మేలు.
* ముఖం ఉబ్బినట్టు అయినప్పుడు కూడా ఆవిరి పడితే... చక్కటి ఫలితం ఉంటుంది.
* ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు మరీ వేడిగా మసులుతున్నప్పుడు ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలా చేస్తే చర్మం ఎర్రగా కందిపోతుంది. ముఖం మీద విపరీతంగా మొటిమలున్నవారు ఆవిరికి దూరంగా ఉండటం మంచిది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com