చెవిలో ఇన్ఫెక్షన్.! ఎందుకొస్తుంది.? చిట్కాలతో నివారించగలమా.?
- April 29, 2024
చెవి నొప్పి.. చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయ్. చెవి ఇన్ఫెక్షన్లు పలు బ్యాక్టీరియా, వైరస్ కారణంగా తలెత్తే సమస్యలు. ఈ సమస్యలు వచ్చాకా వీటిని నివారించుకోవడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసకోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
అయితే, చెవిలో ఇన్ఫెక్షన్లకు కారణం ఏంటీ.? అలెర్జీలూ, సైనస్ సమస్యలు, చెవిలోని యూస్టేషియన్ ట్యూబులను అడ్డుకుంటాయ్. తద్వారా చెవిలో ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయ్.
రకరకాల ఇనుప వస్తువులతో చెవిలో తిప్పడం ఓ కారణం. అలాగే పొల్యూషన్లో తిరిగి వచ్చినప్పుడు ముఖం, చేతులతో పాటూ చెవుల్ని, ముక్కునీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి.
చల్లని వాతావరణం ముఖ్యంగా చెవిలో ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంటుంది. అందుకే చల్లని వాతావరణంలో తిరిగేటప్పుడు చెవుల్ని కవర్ చేసుకునేలా స్కార్ఫ్ యూజ్ చేయడం.. లేదంటే చెవిలో మెత్తని బట్ట, దూదిని వుంచుకోవడం చేయాలి.
అప్పుడప్పుడూ ఇయర్ డ్రాప్స్ కూడా యూజ్ చేస్తుండాలి. ఇవి చెవి నొప్పితో పాటూ, ఇన్ఫెక్షన్లను రానివ్వకుండా కూడా సహాయ పడతాయ్. చెవిలో తీవ్రమైన నొప్పి వేధిస్తుంటే, ఐబుఫ్రోఫిన్ లేదా అసిటమినోఫిన్ వంటి నొప్పి నివారణ మందుల్ని వైద్యుని సలహాతో తీసుకోవచ్చు. చెవి ఇన్ఫెక్షన్ని అశ్రద్ధ చేయరాదు. ఏమాత్రం ఇన్ఫెక్షన్ లక్షణాలు తెలిసినా వెంటనే వైద్యుని సలహా తీసుకోవాలి.
తాజా వార్తలు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!