హైదరాబాద్‌లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- April 30, 2024
హైదరాబాద్ కేంద్రంగా.. బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నగరానికి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది.
ఈ మేరకు ఖాజాగూడలో ఏకంగా ఓ గేమింగ్ స్థావరాన్నే నడుపుతోంది. అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకుంటుంది. అయితే, గేమింగ్ పాల్గొని ఇటీవలే కొంతమంది బడాబాబులు రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో సమాచారం అందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఖాజాగూడలోని గేమింగ్ స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ మేరకు రూ.62 వేల నగదును సీజ్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







