బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- April 30, 2024
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ప్రవేశించి మరీ భారత వైమానిక దళం జరిపిన దాడులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ దాడుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరిపిన తర్వాత ముందు పాకిస్థాన్ ప్రభుత్వానికి సమాచారం అందించామని, ఆ తర్వాతే ప్రపంచానికి వెల్లడించామని మోడీ పేర్కొన్నారు. ఈమేరకు కర్ణాటకలోని బాగల్ కోట్ లో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోడీ ఈ విషయాన్ని బయటపెట్టారు.
శత్రువుకు ఎదురు నిలిచి పోరాడడమే మోదీకి తెలుసని, వెనకనుంచి దాడి చేయడం తన విధానం కాదని ప్రధాని చెప్పారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులను వెతుక్కుంటూ వెళ్లి దాడి చేశామని వివరించారు. దాడుల తీవ్రతను, దానివల్ల ఏర్పడిన విధ్వంసం గురించి ప్రపంచానికి వెల్లడించాలని ఆర్మీకి సూచించానని మోడీ చెప్పారు. అయితే, మీడియాకు వెల్లడించేందుకు ముందే జరిగిన నష్టం గురించి పాక్ కు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. పాక్ కు సమాచారం అందించేందుకు ఆలస్యం జరిగింది.. అయినప్పటికీ వేచి చూసి, పాక్ కు తెలియజేశాకే మీడియాకు వెల్లడించామని వివరించారు. మోడీ ఏంచేసినా అందరికీ తెలిసేలాగానే చేస్తాడని, చాటుమాటు వ్యవహారాలు తెలియవని చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







