‘కంగువ’.! సూర్య కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్.!

- May 01, 2024 , by Maagulf
‘కంగువ’.! సూర్య కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్.!

‘సింగం’ సిరీస్‌తో పాపులరైన హీరో సూర్య. తమిళంతో పాటూ తెలుగులోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా సూర్య కెరీర్‌లో ఓ మైలురాయి కానుంది.

మాస్ రాజా రవితేజతో ‘దరువు’ సినిమా తెరకెక్కించిన శివ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలు సినిమాని ఓ డిఫరెంట్ జోనర్‌గా ప్రొజెక్ట్ చేశాయ్. ఆర్టిస్టుల మేకోవర్స్, కాస్ట్యూమ్, యాక్షన్ ఘట్టాలు.. ఇలా ప్రతిదీ ఈ సినిమాని చాలా భిన్నంగా చూపిస్తున్నాయ్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇండియాలోనే కాకుండా, వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com