‘హరి హరవీరమల్లు’.! వేర్ ఈజ్ క్రిష్.!

- May 01, 2024 , by Maagulf
‘హరి హరవీరమల్లు’.! వేర్ ఈజ్ క్రిష్.!

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హరవీరమల్లు’. ఈ సినిమా మొగలుల కాల నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేశాడు క్రిష్ జాగర్లమూడి. సినిమాకి సంబంధించి కొంత మేర ప్రమోషన్లు కూడా నిర్వహించాడు క్రిష్, పవన్ కళ్యాణ్‌తో కలిసి. 

అయితే, అనూహ్యంగా క్రిష్‌కీ, పవన్ కళ్యాణ్‌కీ, అలాగే నిర్మాణ సంస్థకీ క్రిష్‌కీ కూడా ఏదో కిరికిరి రావడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేశారన్న ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వదలబోతున్నారు. ఇదెలా సాధ్యం అంటే.. ఏమో తెలీదు కానీ, ‘ధర్మం కోసం చేసే యుద్ధం..’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక, రేపు అనగా మే 2న రిలీజ్ చేయబోయే ఫస్ట్ సింగిల్ ముచ్చట ఎలా వుండబోతోందో పవన్ ఫ్యాన్స్‌లో ఏ మేర ఉత్సాహం నింపబోతోందో అనే విషయం పక్కన పెడితే, ఈ అప్డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్‌పై దర్శకుడు క్రిష్ పేరు కనిపించకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్. 

దర్శకుడు మారాడా.? మారతాడా.? అసలు క్రిష్ ముచ్చటేందీ.? అనే విషయాలు తెలియాల్సి వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com