ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషిస్తా: టాలీవుడ్ న‌టీమ‌ణి ధ‌నీబోస్‌

- May 11, 2024 , by Maagulf
ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషిస్తా: టాలీవుడ్ న‌టీమ‌ణి ధ‌నీబోస్‌

హైద‌రాబాద్‌: గ‌త ప‌దేళ్ళ క్రితం క‌ల‌క‌త్తా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరంగేట్రం చేసిన ధ‌నీబోస్ ఎటువంటి పాత్ర‌లో అయినా ఛాలెంజ్ తీసుకుని ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగిన అరుదైన న‌టి. హిందీ, బెంగాలీ చిత్రాల్లో న‌టించిన ఈ న‌టీమ‌ణి ధ‌నీబోస్‌కు తెలుగు చిత్రాలంటే మ‌క్కువ‌ని, తెలుగు చిత్రాల్లో న‌టించ‌డానికి ఎటువంటి ప్ర‌తిభావంత‌మైన పాత్ర‌నైనా తాను న‌టించి మెప్పించ‌గ‌ల‌న‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ధ‌నీబోస్ మాట్లాడుతూ, అందం, అభిన‌యం, చొర‌వ క‌లిగిన ఈ న‌టీమ‌ణి తెలుగు చిత్రాల్లో ఉన్న టెక్నాల‌జీ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, తెలుగు వారి ఖ్యాతి అంత‌ర్జాతీయంగా గ‌డించార‌ని అటువంటి తెలుగు చిత్రాల్లో న‌టించ‌డం త‌న జీవిత ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. రాఖీబంధ‌న్‌, జి బంగ్లాలో జమాయిరాజ‌, స‌న్‌బంగ్లాలో సిమ‌నా పేరియే, క‌ల‌ర్స్ బంగ్లాలో అలై బ‌హుబాన్ బ‌హ‌రా వంటి ఎన్నో చిత్రాల్లో అవ‌లీల‌గా న‌టించి మెగా సీరియ‌ల్స్‌, ఓటీపీ సీరియ‌ల్స్‌లో న‌టించిన ఈ న‌టీమ‌ణి సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన ర‌హ‌స్య‌బేడీ బ‌స‌బ్‌, మిషా బొహెరే ప‌కి వంటి చిత్రాల్లో న‌టించిన ఈ న‌టి ప‌లు నేష‌న‌ల్ బ్రాండ్స్ యాడ్స్‌లో జైపాన్‌, ఎస్యూర్‌, కిన్న‌ర్ కిన్న‌రి వంటి ప్ర‌త్యేక యాడ్స్‌లో న‌టించింది. ఇటీవ‌ల రేడియో అనే చిత్రంలో విశేష పాత్ర పోషించి మెప్పు పొందిన ఈ న‌టీమ‌ణి తెలుగు చిత్రాల్లో విశేషంగా స‌క్స‌స్ అవ‌గ‌ల‌ద‌ని ఆకాంక్షిద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com