‘కల్కి’.! ఆ రూమర్ నిజమేనా.?
- May 17, 2024
ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కల్కి 2898ఏడీ’ జూన్‌లో విడుదలకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్టింగ్ నుంచీ ఓ రేంజ్లో అంచనాలున్న సంగతీ తెలిసిందే.
భారీ నుంచి అతి భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజయంతీ మూవీస్ బ్యానర్ అధినేత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
గ్రాఫిక్స్ వర్క్ న భూతో న భవిష్యతి అనేలా చేస్తున్నారు ఈ సినిమాకి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భవిష్యత్ కాలాన్ని చూపించబోతున్నారు ఈ సినిమాతో.
అంటే.. ఆటోమెటిగ్గా ఈ సినిమాపై అంచనాలుంటాయ్. ఇక, నటీనటుల పరంగా కూడా స్టార్ కాస్టింగ్ యాక్ట్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమాగా ‘కల్కి’ రూపొందుతోంది.
కాగా, తాజాగా ఈ సినిమా గురించి ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒకే ఒక్క పాట తప్ప సినిమా ఫార్ములా ప్రకారం ఐదు లేదా ఆరు పాటలుండవని అంటున్నారు.
అయితే, సిట్యువేషనల్‌గా సాగే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ బిట్స్ వుంటాయట. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ప్రబాస్ సరసన ఇద్దరు అందగత్తెలు ఈ సినిమాలో నటిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ. అలాంటిది ఈ కాంబోపై పాటల్లేకపోవడం అంటే ఒకింత ఆలోచించాల్సిన అంశమే. కానీ, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..