విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- May 18, 2024
దుబాయ్: దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో అసాధారణమైన ఎమిరాటీ విద్యార్థుల కోసం 400 కంటే ఎక్కువ స్కాలర్షిప్లను ప్రకటించారు. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) దుబాయ్ సోషల్ ఎజెండా 33లో భాగంగా ఈ ఆఫర్ ని వెల్లడించింది. దుబాయ్ డిస్టింగ్విష్డ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టబడిన ఈ స్కాలర్షిప్లు ఇటీవలి తనిఖీలలో 'గుడ్ లేదా బెటర్' అని రేట్ చేయబడిన పాఠశాలల్లో అత్యుత్తమ ఎమిరాటీ విద్యార్థుల వార్షిక ట్యూషన్ ఫీజులో సగం కవర్ చేస్తాయని తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు మే 20 నుండి జూన్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎమిరాటీ తల్లిదండ్రులు తమ పిల్లలను KHDA వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం 2030 నాటికి మొత్తం 1800 స్కాలర్షిప్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ఇప్పటి వరకు తొమ్మిది పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని KHDA డైరెక్టర్ జనరల్ అయిన ఐషా అబ్దుల్లా మిరాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!