సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- May 18, 2024
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. ఇటీవల డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడటంతో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మే 4న జరగాల్సిన డైరెక్టర్స్ డేని ఈసారి గ్రాండ్ గా మే 19న LB స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి సెలబ్రేట్ చేయనున్నట్టు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకటించారు.
మే 19న LB స్టేడియంలో జరగబోయే డైరెక్టర్స్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ లో చాలా మంది డైరెక్టర్స్ పాల్గొని స్కిట్స్, డ్యాన్సులు.. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ లు చేయబోతున్నారు. అలాగే పలువురు హీరోలు, హీరోయిన్స్, నటీనటులు కూడా ఈ ఈవెంట్లో హాజరు కానున్నారు. ఇక డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న పలువురు డైరెక్టర్స్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు.
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ తో పాటు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట.. పలువురు డైరెక్టర్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందచేసి ఈవెంట్ కి ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి రామ్ గోపాల్ వర్మ కూడా వెళ్లడం విశేషం. ఆర్జీవీ కూడా సీఎం రేవంత్ ని కలవడం చర్చగా మారింది. అసలు ఇలాంటి అసోసియేషన్ కార్యక్రమాలకు ఎప్పుడూ రాని ఆర్జీవీ ఇప్పుడు సీఎం రేవంత్ ని ఆహ్వానించడానికి వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆర్జీవీ గతంలో రేవంత్ ని అభినందిస్తూ పలుమార్లు ట్వీట్స్ కూడా చేసారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జీవీ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో డైరెక్టర్స్ డే ఈవెంట్లో ఆర్జీవీ, సీఎం రేవంత్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!