విదేశీ పర్యటనకు చంద్రబాబు
- May 19, 2024
హైదరాబాద్: దాదాపుగా రెండు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీబిజీగా గడిపారు. క్షణం తీరికలేకుండా ప్రజల్లోకి వెళ్లారు. ఎట్టకేలకు పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త సేద తీరేందుకు సమయం దొరికింది. మరోవైపు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాస్త టెన్షన్ లో కనిపిస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే రిలాక్స్ అయ్యేందుకు నేతలంతా విహార యాత్రలకు బయల్దేరుతున్నారు. వరుస ప్రచారాలు, ఎన్నికల వ్యూహాలు, సభలతో నిర్విరామంగా తిరిగిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విశ్రాంతి కోసం నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు... వారం రోజుల తర్వాత తిరిగి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగిరానున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 31వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!