ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- May 21, 2024
హైదరాబాద్: బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు.
ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు.
ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు బుల్లితెర నటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..