'రైట్ రైట్'కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు

- June 09, 2016 , by Maagulf
'రైట్ రైట్'కి  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు

క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన  తాజా చిత్రం `రైట్ రైట్‌`. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ  నిర్మించిన ఈ చిత్రం రేపు (10.06.) విడుదల కానున్న విషయం తెలిసిందే. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర  పోషించారు. 

ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆకాంక్షించారు. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై యమ్మెస్ రాజు నిర్మించిన 'వర్షం' ప్రభాస్ కెరీర్ కి కీలక మలుపైన విషయం తెలిసిందే. ఆ సినిమా అప్పట్నుంచీ ఆయనతో ప్రభాస్ కి మంచి అనుబంధం ఉంది. యమ్మెస్ రాజు తనయుడు సమంత్ అశ్విన్ ని తమ్ముడిలా భావిస్తారు ప్రభాస్. అందుకే 'రైట్ రైట్' ఘనవిజయం సాధించాలని ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు అందజేశారు.

''Best wishes to Sumanth Ashwin, Prabhakar (Kalakeya), Manu, and Vamshi Krishna for their film Right Right that releases tomorrow'' అని ప్రభాస్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com