షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్న భారత రాయబారి సంజయ్ సుధీర్
- May 23, 2024
యూఏఈ: మే 21న అబుదాబిలో జరిగిన 5వ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ (MFAEA)లో యూఏఈ విదేశాంగ మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుండి భారత రాయబారి సంజయ్ సుధీర్ షీల్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. అలాగే, H.E. దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ కూడా షీల్డ్‌ను అందుకున్నారు. అవార్డులలో రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల విభాగంలో అవార్డులు అందుకున్న ఏకైక దేశంగా ఇండియా నిలిచింది. MFAEA అవార్డులు రావడం భారతదేశం-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంబసీ మరియు కాన్సులేట్ కృషికి గుర్తింపును ఇచ్చింది. ఇది యూఏఈలోని భారతీయ ప్రవాసుల సంక్షేమం పట్ల ఎంబసీ, కాన్సులేట్ నిబద్ధతను కూడా మరోసారి చాటి చెప్పిందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..