బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు
- May 23, 2024
బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనేకాదు.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రేవ్ పార్టీలో డ్రగ్స్, గంజాయి పట్టుబడటంతో ..పార్టీలో పాల్గొన్నవారి బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు సేకరించారు. దాదాపు 103 మంది వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా.. వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
రేవ్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. వీరిలో 59 మంది పురుషులు, 27మంది యువతులు, మహిళలు ఉన్నారు. వీరిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. హేమ బ్లడ్ శాంపిల్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. బ్లడ్ రిపోర్టులో పాజిటివ్ గా వచ్చిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇవ్వనుంది. ఇదిలాఉంటే.. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







