ఎట్టకేలకు ‘బుజ్జి’ వెర్సస్ ‘భైరవ’ ఎంట్రీ షురూ అయ్యింది.!
- May 23, 2024
ప్రబాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే.. ఈ సినిమా అంత ఆషామాషీ సినిమా కాదనిపిస్తోంది. అఫ్కోర్స్.! ఆ సంగతి ముందే చెప్పేశారనుకోండి. డబ్బుకు ఎంతమాత్రమూ వెనుకాడకుండా.. భీభత్సంగా ఖర్చు చేసేస్తున్నారు ఈ సినిమా కోసం.
ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కల్కి’ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. అందులో భాగంగానే ‘బుజ్జి..బుజ్జి..’ అంటూ ఈ సినిమాలో ప్రబాస్ యూజ్ చేయబోయే కారును పరిచయం చేశారు.
అలాగే, తాను పోషిస్తున్న భైరవ పాత్రలోనే ప్రబాస్ ఈ ప్రమోషన్ కార్యక్రమానికి విచ్చేయడం విశేషం. ఈ సూట్ కోసం అక్షరాలా 2 కోట్లు ఖర్చు చేశారట. అలాగే, బుజ్జి పేరుతో తయారు చేసిన కారుకు ఏకంగా 7 కోట్ల వరకూ ఖర్చయ్యిందట.
జేమ్స్ బాండ్ సినిమాల్లోని స్పెషల్ కారులాగా.. భైరవ నడపబోయే ఈ కారుకు అనేక ప్రత్యేకతలున్నాయట. రోడ్డుపైనే కాదు, గాలిలో కూడా ఈ కారు ఎగురుతుందట. కారు కోసమే ఇంత ఖర్చు చేసి స్పెషల్ ఈవెంట్ చేశారు.
ఇక ముందు ముందు ఈ సినిమా ప్రమోషన్లు ఏ రేంజ్లో వుండబోతున్నాయో ఊహించడమే కష్టంగా వుంది. జూన్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







