రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా..
- May 24, 2024
అబుధాబి: యూఏఈ గోల్డెన్ వీసా ను అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా రజనీకాంత్ చేరారు.వీసా పొందిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాన్నో గౌరవంగా భావిస్తున్నానన్నారు. యూఏఈ ప్రభుత్వానికి, తన స్నేహితుడు, లులూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుక్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్,సిరాశ్రీ తదితరులకు ఈ వీసా లభించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..