బెంగళూరు రేవ్ పార్టీ కేసు..నటి హేమ‌ కీలక వ్యాఖ్యలు

- May 23, 2024 , by Maagulf
బెంగళూరు రేవ్ పార్టీ కేసు..నటి హేమ‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ న‌టి హేమ‌కు పోలీసులు నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసు విచార‌ణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వ‌హించ‌గా.. ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ టెస్ట్‌లో హేమ‌తో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. దీంతో హేమ‌తో పాటు ప‌లువురికి పోలీసులు నోటీసులు పంపారు. అయితే ఘ‌ట‌న‌పై హేమ‌ తాజాగా స్పందిస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏం చేస్తారో చేసుకోండి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు నేను కూడా మాట్లాడ‌తా అంటూ మీడియాతో చెప్పుకోచ్చింది.

మ‌రోవైపు ఈ పార్టీకి వ‌చ్చిన హేమ త‌న అస‌లు పేరును కృష్ణ‌వేణిగా న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో ఆమె వీడియో వైర‌ల్ అయ్యాకే హేమ‌గా గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com