రియాద్ ఫుడ్ పాయిజనింగ్ కేసు.. అధికారులపై చర్యలు..!
- May 24, 2024
రియాద్: రియాద్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనకు సంబంధించి సాక్షాలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తారుమారు చేసినట్లు యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) గుర్తించింది. బాధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతుంది. ఏ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తీవ్రమైన చర్యలు అమలు చేపడతామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. కింగ్ మరియు క్రౌన్ ప్రిన్స్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడేందుకు వేగవంతమైన మరియు పారదర్శక చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా వెల్లడించింది. హంబుర్గిని రెస్టారెంట్లో ఉపయోగించిన BON TUM బ్రాండ్ నుండి "క్లోస్ట్రిడియం బోటులినమ్" కలిగి ఉన్న కలుషితమైన మయోనైస్గా గుర్తించారు. వెంటనే స్పందించిన మునిసిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీతో సమన్వయంతో మయోనైస్ పంపిణీని నిలిపివేసి, రీకాల్ చేయడం ప్రారంభించారు. తాజాగా కొత్త కేసులు ఏవీ నమోదు కానందున ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..