క్షమాభిక్ష పథకం.. జూన్ 17 తర్వాత ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెక్..!
- May 25, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు దేశం విడిచి వెళ్లడానికి లేదా వారి హోదాను చట్టబద్ధం చేయడానికి కొనసాగుతున్న క్షమాభిక్ష వ్యవధిని ఉపయోగించుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. గడువు ముగిసిన తర్వాత రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి, వారిని బహిష్కరించనున్నట్లు ఒక ట్వీట్‌లో మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో, కువైట్ క్షమాభిక్ష వ్యవధిని ప్రకటించింది. ఇది జూన్ 17తో ముగుస్తుంది. ఉల్లంఘించినవారు తమ స్థితిని చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా జూన్ 17 గడువులోపు సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత, మంత్రిత్వ శాఖ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయనుంది. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు దేశంలోకి తిరిగి ప్రవేశించడానికి వీలు లేకుండా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..