ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం

- May 26, 2024 , by Maagulf
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం

దోహా: దోహా నుంచి డబ్లిన్ వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ పరిణామంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు.

టర్కీ మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా విమానంలో టర్బులెన్స్‌కి గురైంది. ఆరుగురు ప్రయాణికులు, మరో ఆరుగురు విమాన సిబ్బంది గాయపడ్డారని డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ధృవీకరించాయి. దోహా నుంచి ఖతార్ ఎయిర్‌వేస్ విమానం QR017 ఆదివారం 13.00 గంటల ముందు డబ్లిన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొన్నాయి.

ల్యాండింగ్ తర్వాత, ఎయిర్ పోర్టు పోలీస్ రెస్క్యూ సిబ్బంది గాయపడిన 12 మందికి అత్యవసర సేవల్ని అందించింది. టర్కీ మీదుగా వెళ్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురైందని డబ్లిన్ ఎయిర్‌పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కాగా, ఇటీవలే 211 మంది ప్రయాణికులతో లండన్ నుంచి సింగపూర్ ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రమైన టర్బులెన్స్‌కి గురైన విషయం తెలిసిందే. బ్యాంకాక్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో చెలరేగిన అల్లకల్లోలంతో 73 ఏళ్ల బ్రిటన్ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. విమానంలోని చాలా మంది తలలకు, వెన్నుముక, మెదడు భాగాలకు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నారని సింగపూర్ రవాణా శాఖ మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com