జూన్‌ 28న ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలు

- May 28, 2024 , by Maagulf
జూన్‌ 28న ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలు

టెహ్రాన్: గత వారం హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు జూన్‌ 28న నిర్వహించనున్నారు. . ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్‌ మొక్బర్‌ సోమవారం కొత్త పార్లమెంట్‌ను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగిస్తూ అధ్యక్ష ఎన్నికలపై ప్రకటన చేశారు. మంగళవారం పార్లమెంట్‌ కొత్త స్పీకర్‌ను కూడా ఎన్నుకుంటుందని భావిస్తున్నారు. ఇరాన్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ దేశానికి ఆదాయం సమకూర్చే కీలక వనరైన ముడి చమురు ఉత్పత్తిలో ఇరాన్‌ మెరుగైన ఫలితాలను సాధించిందని మొక్బర్‌ చెప్పారు. రైసి పాలనలో దేశం పురోగతి సాధించిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వుందన్నారు. ఇవన్నీ మన మత పెద్ద ఆయతుల్లా ఖమేని మార్గనిర్దేశంలో అధ్యక్షుడు రైసీి నిజాయితీతో చేసిన కృషి వల్లనే సాధ్యమయ్యాయని మొక్బర్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు చనిపోయిన 50 రోజుల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ప్రకారమే రౌసీ స్థానంలో కొత్త అధ్యక్షుడిని జూన్‌ 28న ఎన్నుకుంటారు. గురువారం నుండి ఐదు రోజుల పాటు అభ్యర్థుల నమోదు ప్రక్రియ ప్రారంభమవు తుంది. మొక్బర్‌ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com