తెలంగాణలో3 రోజులు భగభగ!

- May 29, 2024 , by Maagulf
తెలంగాణలో3 రోజులు భగభగ!

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ మరో 4, 5 రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు 3, 4 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనేది నానుడి. అయితే ఈసారి భారీ ఉష్ణోగ్రతలు ఉండబోవని IMD వెల్లడించింది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభం కాగా అదే సమయంలో బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ ఏర్పడింది. దీనివల్ల గాలిలో తేమ ఉండటంతోపాటు గంటకు 30-40KM వేగంతో రాష్ట్రంపైకి పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతుందని, వడగాలులు ఉండవని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలను ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు ఇవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. ఎప్పుడూ చల్లగా ఉండే హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో సైతం తాజాగా 30.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com