‘కల్కి 2898 ఏడి’.! బుజ్జి ఓవరాక్షన్ మామూలుగా లేదుగా.!
- May 29, 2024
ప్రబాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ సినిమా జూన్‌లో రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయ్. రీసెంట్గా జరిగిన ఈవెంట్లో భాగంగా సినిమాలో ప్రబాస్ యూజ్ చేయబోయే ప్రత్యేకమైన కారును ప్రదర్శనకు పెట్టారు.
ఆ కారును ప్రమోట్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేయడం.. అలాగే దాని చుట్టూ ప్రమోషన్లు చేయడంలాంటివి చేస్తున్నారు.
ఈ కారును ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం తిప్పేసేలా వున్నారు. ప్రస్తుతం చెన్నై రోడ్లపై ఈ కారు చక్కర్లు కొడుతోంది.
భైరవ పాత్ర పోషిస్తున్న ప్రబాస్ మాత్రం ఈ ప్రమోషన్లలో కనిపించడం లేదు. సాధారణంగానే ప్రబాస్ సినిమా ప్రమోషన్లలో తక్కువగా కనిపిస్తుంటాడు. మరి, లార్జ్ స్కేల్ మూవీ ‘కల్కి’లో ప్రబాస్ ప్రమోషన్ల పాత్ర ఎంత మేర వుండబోతోందో చూడాలిక.
ఇకపోతే, ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యూచర్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..