‘పుష్ప 3’ ఎప్పుడంటే.!

- May 29, 2024 , by Maagulf
‘పుష్ప 3’ ఎప్పుడంటే.!

కోవిడ్ టైమ్‌లో ఎలాంటి ఎక్స‌్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకున్న సినిమా ‘పుష్ప’. భారీ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టింది. రికార్డులు సృస్టించింది. ఆ స్థాయిలో విజయం సాధించిన ఈ సినిమాకి అంతకు మించి అనేలా సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘పుష్ప - ది రూలింగ్’. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాని ఫ్రాంచైజీల్లా మరిన్ని పార్టులు తెరకెక్కించబోతున్నారని ఆల్రెడీ సుక్కు అండ్ టీమ్ వెల్లడించింది.
అందులో భాగంగానే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ‘పుష్ప 3’ తెరకెక్కించేందుకు ఇంకా చాలానే టైమ్ పట్టే అవకాశాలున్నాయట.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ మరో రెండు సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. అలాగే, డైరెక్టర్ సుకుమార్ కూడా. రెండు సినిమాలు పూర్తి చేశాకే అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా వుండే అవకాశాలున్నాయ్.

అలా ‘పుష్ప 3’ ఇప్పడప్పుడే తెరకెక్కే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, ఖచ్చితంగా మూడో పార్ట్ వుంటుందినయితే టీమ్ గట్టిగా చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com