ఈ నెల 31న దేశవ్యాప్తంగా రూ.99కే సినిమా టికెట్..!
- May 29, 2024
న్యూఢిల్లీ: సినీప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31న సినిమా లవర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99 టికెట్ కే చూడొచ్చని వెల్లడించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ లాంటి చైన్లతోపాటు దేశంలో 4 వేలకుపైగా ఉన్న స్క్రీన్లలో ఇదే టికెట్ ధర ఆ రోజు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లవైపు రప్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఓవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫీవర్ కారణంగా ఈ సమ్మర్ లో టాలీవుడ్, బాలీవుడ్ సహా ఎక్కడా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. విడుదలైన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా పరిమితంగానే విడుదల కావడంతో టికెట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది.
బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే లాంటి ఆన్ లైన్ వేదికల ద్వారా ఈ నెల 31న సినిమా టికెట్లు బుక్ చేసుకొనే వారు రూ. 99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా థియేటర్ లోని కౌంటర్ లో టికెట్ కొంటే మాత్రం జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవు. అయితే ఐమ్యాక్స్, రిక్లైనర్ సీట్లకు మాత్రం రూ. 99 టికెట్ ధర వర్తించదు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఛోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ డమ్ యాన్, హైక్యూ ద డంప్ స్టర్ బ్యాటిల్ లాంటి సినిమాలు ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!