‘మనమే’ నుంచి ‘టప్పా టప్పా..’ సాంగ్ విజువల్ అదిరిందప్పా.!

- May 30, 2024 , by Maagulf
‘మనమే’ నుంచి ‘టప్పా టప్పా..’ సాంగ్ విజువల్ అదిరిందప్పా.!

శర్వానంద్, కృతి శెట్టి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మనమే’. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ సినిమా సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

పెళ్లి తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న చిత్రమిది. డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడీ సినిమాలో శర్వానంద్. మొన్నా మధ్య గ్లింప్స్ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్‌గా లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విజువల్‌గా చాలా అద్భుతంగా వుందంటూ రెస్పాన్స్ వస్తోంది. వెడ్డింగ్ నేపథ్యంలో చిత్రీకరించిన సాంగ్ ఇది. వినసొంపుగా వుందా.. లేదా.? అనే విషయం పక్కన పెడితే,  విజువల్స్ అయితే చాలా గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయ్.

డాన్స్ స్టెప్పులు కూడా సింప్లీ సూపర్బ్. ‘ఖుషీ’ ఫేమ్ వహాద్ అబ్ధుల్ సంగీతమందించిన ఈ సాంగ్ స్క్కీన్‌పై అదిరిపోవడం ఖాయం అనిపిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com