కార్తికేయ ‘భజే వాయు వేగం’.! పోటీ గట్టిగానే.!

- May 30, 2024 , by Maagulf
కార్తికేయ ‘భజే వాయు వేగం’.! పోటీ గట్టిగానే.!

మే నెల అంటేనే సినీ ప్రేక్షకులకు పండగ సీజన్. వేసవి సెలవుల సీజన్ కావడంతో, . ఆ సీజన్‌ను సినిమాల ద్వారా ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షక దేవుళ్లు. అయితే, ఈ సారి ఎలక్షన్స్, ఐపీఎల్.. ఇలా సినిమాలపై ఫోకస్ బాగా తగ్గింది. ఏవో ఒకటీ అరా రిలీజైన సినిమాలు తప్ప.. అసలు సిసలు సెలవుల సీజన్ మే నెల అంతా ఫ్లాట్‌గా నడిచింది.

మూడు వారాలు సినిమా ధియేటర్ల  బంద్ సినిమాలకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక మంత్ ఎండింగ్‌కి గ్రాండ్‌గా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయ్.
అందులో ఒకటి కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’. ‘బెదురు లంక’ సినిమాతో ఆల్రెడీ హిట్టు కొట్టి వున్న కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ సినిమాతో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే తన వంతుగా సినిమాని బాగానే ప్రమోట్ చేశాడు కూడా. ‘నేల టిక్కెట్టు’ ఫేమ్ మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ టైసన్ చాలా కాలం తర్వాత ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో.

సినిమాకి బజ్ బాగానే వుంది. కానీ, మిగిలిన సినిమాల పోటీ తట్టుకుని ఈ సినిమా నిలబడగలదో లేదో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com