సోహర్ (ఒమాన్) లో కొత్త ఔట్‌లెట్ ను ప్రారంభించిన లు-లు

- July 02, 2015 , by Maagulf
సోహర్ (ఒమాన్) లో కొత్త ఔట్‌లెట్ ను ప్రారంభించిన లు-లు

ఒమాన్ రెటైల్ వ్యాపారరంగంలో తన ముద్ర వేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం  లు-లు హైపర్ మార్కెట్ వారు సోహర్ లో నిన్న ఒక కొత్త ఔట్‌లెట్ ను  ఒమాన్ పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ - అహ్మద్ బిన్ హస్సాం అల్ థీబ్ గారిచే, మ్యానేజింగ్ డైరెక్టర్ యూసుఫాలీ ఎమ్. ఏ. మరియు ఉన్నతస్థాయి అధికారుల సమక్షంలో ప్రారంభించారు. లు-లు వారి సూపర్ మార్కెట్ చైన్ లో 117వదైన, నగరంలోని ప్రధాన కూడలిలో నెలకొని ఉన్న ఈ బ్రహ్మాండమైన షాపింగ్ మాల్, సుమారు 2,00,00 చ. అ. లలో విస్తరించియున్న 3 లెవెల్స్ లో ఉందని, వినియోగదారులకు సంపూర్ణ షాపింగ్ అనుభూతినివ్వడమే కాకుండా, 250 మంది స్థానికులకు సేనియర్ మరియు మిడ్- లెవెల్ లో ఉపాధి కల్పించినందుకు సంతోషిస్తున్నామని శ్రీ యూసుఫాలి చెప్పారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com