'రోజుకు Dh800 సంపాదించండి': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక

- June 01, 2024 , by Maagulf
\'రోజుకు Dh800 సంపాదించండి\': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక

యూఏఈ: స్కామర్లు వాట్సాప్ సమూహాలను సృష్టించడం, యూట్యూబ్ పోస్ట్‌ల ద్వారా  “అదనపు ఆదాయాన్ని సంపాదించడం” వంటి ఆన్‌లైన్ టాస్క్‌లు అని ఆకర్షించే ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.  తాజాగా ఎన్‌హమీడియా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ 27 గ్రూప్‌లలో పోస్టులు చేసింది. రోజున రెండు గ్రూపుల నుంచి ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని నివాసితులు చెబుతున్నారు.  ప్రతి గ్రూపులో 50 నుండి 75 మంది వ్యక్తులు ఉంటారని, దీని ఏరియా కోడ్ +62 (ఇండోనేషియా) నుండి +94 (శ్రీలంక), +967 (యెమెన్), +20 (ఈజిప్ట్) మరియు +971 (యూఏఈ) వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. హోస్ట్/సమూహ సృష్టికర్త మొబైల్ నంబర్ +20 150 1687757ని ఉపయోగించారని పేర్కొన్నారు.  యూఏఈ నివాసితులు గ్రూపులో తమను చేర్చిన సమయంలో ఆశ్చర్యపోయారు. స్కామర్‌లు తమ వ్యక్తిగత నంబర్‌లను ఎలా పట్టుకున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అనంతరం వారు టాస్క్ ల పేరిట మెసేజ్ లను పంపుతారు. రోజుకు Dh500 నుండి Dh800 వరకు అదనపు ఆదాయం అంటూ ఊరిస్తారని తెలిపారు.ఇలా రకరకాల పేర్లతో వాట్సాప్ గ్రూపులను సృష్టించి, ఫేక్ మెసేజులు, లింకులను పంపుతూ మోసాలకు పాల్పడుతారని వివరించారు. వారి బారిన పడ్డ బాధితుల్లో ఒకరైన దుబాయ్ హోటల్ వ్యాపారి మాట్లాడుతూ.. ఓ ఫేక్ లింకును క్లిక్ చేసి తాను Dh66,000ను కోల్పోయినట్లు పేర్కొన్నారు.

ఏవైనా అనుమానస్పద గ్రూపుల గురించిన సమాచారాన్ని దుబాయ్ పోలీసులను టోల్-ఫ్రీ నంబర్ 901 లేదా +971 4 203 6341లో తెలియజేయవచ్చు.వారి వెబ్‌సైట్‌లో ఇ-క్రైమ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కూడా ఉంది. అబుదాబి పోలీసులకు ఏడాది పొడవునా 24/7 అందుబాటులో ఉండే అమన్ సర్వీస్ ఉంది. వారి సర్వీస్ హాట్‌లైన్ 800-2626 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com